Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 7:11 pm Posted by : ramakrishna

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థినులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల  (కేజీబీవీ) విద్యార్థినులు ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటారు. ఎంపీసీ లో ఎం. మధుశ్రీ 466/470 ప్రథమ స్థానం, పి. దుర్గభవాని 464/470, బి. ప్రణీత 464/470 ద్వితీయ స్థానం, ఎం. భార్గవి 461/470 తృతీయ స్థానం, బైపీసీ లో కె. గౌతమి 432/440 ప్రథమ స్థానం, బి. ప్రియాంక 429/440 ద్వితీయ స్థానం, ఎ.మేఘన 428/440 తృతీయ స్థానం. ఎంపీసీ లో మొత్తం 22 మంది విద్యార్థినీలకు గాను 22 మంది విద్యార్థినీలు (98.2%) 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బైపీసీ లో మొత్తం 35 మంది విద్యార్థినీలకు గాను 34 మంది విద్యార్థినీలు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 57 మంది విద్యార్థినిలకు గాను 56 మంది విద్యార్థినీలు ఉత్తీర్ణత సాధించారని, కాగా 57 మంది విద్యార్థినీలకు 39 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల పేర్కొన్నారు.