చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  కోతుల మీదకు వస్తున్నాయనే భయంతో  కేజీబీవీ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది. తీవ్రగాయాలవడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన కావేరి ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద కేజీబీవీ కళాశాలలో ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. బంగ్లాపై ఉన్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థి వాష్​రూమ్ కోసమని బయటకు వచ్చింది. బిల్డింగ్​పై కోతుల మందను చూసిన కావేరి ఒక్కసారిగా ఉలిక్కిపడి భవనం పైనుంచి దూకేసింది. గమనించిన విద్యార్థులు స్థానికుల సహాయంలో...