కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలి
. . . ఎం.సుధాకర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీచేసి, పనిభారం తగ్గించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మోపాల్ కేజీబీవీలో 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వ...