ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కోసం మార్గం సుగమం
హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకొంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్‌కు మార్గం సుగమమైంది.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కోసం ఇంటర్‌పోల్‌కు సీబీఐ సిఫార్సు చేసింది. సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరాయి. దీంతో 196 దేశాల ప్రతినిధులను ఇంటర్ పోల్ అప్రమత్తం చేయనుంది. కాగా, ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికా వదిలి కెనడాలో, శ్రవణ్ రావు బెల్జియంలో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలో త్వరగా నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.