Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 1:49 pm Posted by : ramakrishna

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ లో  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిదేనని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈకేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. యూజర్, పాస్ వర్డ్ ల  సమాచారం ఇవ్వాలని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్ కు సూచించింది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది.