కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరి దోపిడీ కేసులో కీలక పురోగతి
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరి దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారం రోజులుగా పలు రాష్ట్రాల్లో సాగుతున్న గాలింపు చర్యల ఫలితంగా నిందితులను పట్టుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని నిన్న అర్ధరాత్రి కరీంనగర్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ద్వారా మిగతా నిందితుల...