Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2024, 11:59 am Posted by : ramakrishna

నుడా చైర్మన్ గా కేశ వేణు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా కేశ వేణు నియమాకం ఖరారైనట్లు సమాచారం. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్న ఆయనను నుడా చైర్మన్ గా నియమించేందుకు పార్టీ అధిష్టానం సముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ నాయకులకు రాష్ర్ట స్థాయి చైర్మన్ పదవులతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టులను అప్పగిస్తోంది.  ఈ క్రమంలో కేశ వేణుకు నుడా బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. కేశ వేణు దశాబ్దకాలానికిపైగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యూత్ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పని చేసిన కేశ వేణుకు నగరంలోని అన్ని వర్గాలతో సత్సంబంధాలున్నాయి.