Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:51 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన  కీసర డిప్యూటీ తహసీల్దార్

 

 మెడ్చల్, బతుకమ్మ:

పూర్వపు రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలం రోజుకు ఒకటి  ఎసిబికి చిక్కుతునే ఉన్నాయి. గురువారం కీసర మండలం డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కీసర కు సంబంధించి ల్యాండ్ సర్వే అంశంపై కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి  రెండు లక్షల 50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడగా    కొనసాగుతున్న తనిఖీలు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా డబ్బులు తీసుకుంటుండగా పట్టినట్టు సమాచారం.రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్  మెట్ తహసీల్దార్, సర్వేయర్ లు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.

Keesara Deputy Tahsildar caught by the ACB