పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ బాన్సువాడ , బతుకమ్మ : ఇళ్ల చుట్టూ చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజు సూచించారు. పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో ప్రజా పాలన వేడుకలో భాగంగా చెత్తాచెదారం తొలగించి ఆ ప్రాంతంలో మహిళలు ముగ్గులు వేశారు. స్వచ్ఛమైన వాతావరణం ఉంటే రోగాలు దరిచేరవన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఖలేక్, నార్ల సురేష్, ఎజాజ్, లింగం, ఉదయ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.