- మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ తమ నివాసపు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. కలెక్టర్ ఆదేశానుసారం శుక్రవారం ఆయన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పలు వార్డులల్లో ఇంటింటికి తిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎక్కడ కూడా చెత్త, చేదారం, పనికిరాని వస్తువులు, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాదులు రాకుండా ఉండేందుకు మున్సిపాలిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా ప్రజలకు అవేర్నస్ కలిగిస్తూ, పట్టణంలో ఫాగ్గింగ్, ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, డ్రైన్లు శుభ్రపర్చడం ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమం లోమేనేజర్ నరేందర్ వార్డ్ ఆఫీసర్ , మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.