Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 1:53 pm Posted by : ramakrishna

’కొట్టుకుంటూనే ఉండండి‘

ఆప్, కాంగ్రెస్ లకు చురకలు

డిల్లీ ఎన్నికల ఫలితాల స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాల్లో వెనుకబడి ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలకు చురకలంటించారు. డిల్లీలో బలం ఉన్న ఆప్ నకు కాంగ్రెస్ పార్టీ సహకరించలేదని, అందువల్లే ఎన్నికల ఫలితాల్లో వెనకబడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ఇంకా మీలో మీరే కొట్టుకంటూ ఉండండి‘ అని వారి వ్యవహరశైలిపై అసహనం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా లేకపోతే కూటమికి ముగింపు పలకాలని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే.