వరంగల్ సభపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్ష

అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన సూచనలు   హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా...