Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 4:57 pm Posted by : ramakrishna

వరంగల్ సభపై మాజీ సీఎం కేసీఆర్ సమీక్ష

  • అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన సూచనలు

 

హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్పర్సన్ రజినీ సాయిచంద్, నవీనాచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

KCR's review of Warangal assembly