కేసీఆర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి
సీఎం రేవంత్ ని కలిసిన గజ్వేల్ కాంగ్రెస్ నేతలు వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కలిశారు. శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానందున కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రగా హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌ను కలిశారు. అలాగే గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందించనున్నారు.