ముగిసిన కేసీఆర్ విచారణ

హైదరాబాద్, బతుకమ్మ :  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్ కు  మాజీ సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, 50 నిమిషాల పాటు కేసీ ఆర్ విచారణ కొనసాగింది. పలు డాక్యుమెంట్లను పీసీ ఘోష్ కమీషన్ కు కేసీఆర్ అందించారు.