- పదేండ్ల లో బీయర్ ఎస్ 12 వేల మంది పేదింటి ఆడపడుచులకు పథకం పంపిణి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం స్వాహా
- ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ప్రతిపక్షం
- హామీలు అమలు అయ్యేవరకు ప్రభుత్వాన్ని ఎండగట్టుడే
- మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ : స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, బీయర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానవీయ కోణంలోని ఓ ఆలోచనే ఈ కళ్యాణ లక్ష్మి, షాది ముబారఖ్ పథకమని, ఈ పథకం కేసీఆర్ మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గం లోని వేల్పూర్, బాల్కొండ మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉదయం వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కారిణి, వీరవనిత చాకాలి ఐలమ్మ జయంతి కార్యక్రమం లో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రూ. 35 లక్షల ఎం.పీ నిధులతో మరమ్మత్తులు చేపట్టిన షటిల్ కోర్ట్, కబడ్డీ వుడెన్ ఫ్లోర్ లను ప్రారంభించారు. తదనంతరం బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం ఎనిమిది మండలాలకు చెందిన సుమారు 424 కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండుగకు ముందుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న ఆడబిడ్డలందరికీ ముందుగా ఆయన బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ స్వీయ జీవిత అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పథకమన్నారు. పేదింటి కుటుంబంలో పెళ్లి అనేది భారంతో కూడుకున్నటువంటి పని అయినా తన కూతురు పెళ్లిని ఉన్నంతలో ఘనంగా చేయాలని అనుకుంటారని, అటువంటి సందర్భంలో 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు.

ప్రారంభించిన నుండి పదేండ్ల లో ఇప్పటి వరకు 12 వేల మంది పేద ఆడపడుచులకు తాన నియోజకవర్గం లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పేదింటిలో ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగిన ప్రభుత్వం తరఫున ఒక మేనమామగా కొంతమేర సాయం చేయాలని నిర్ణయించి మొదట రూ. 50 వేల తో మొదలుపెట్టి తర్వాత రూ.1 లక్ష నూట పదహార్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం సంతోషం అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో లక్ష రూపాయలతో పాటు మేము అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చాడని, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న తులం బంగారం హామి నెరవేర్చక హామీ స్వాహా అన్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు ప్రతి లబ్ధిదారునికి ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన, నాకు నియోజకవర్గం లో ప్రతిపక్ష హోదా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన హక్కు, బాధ్యత నాపై ఉందన్నారు. తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నాయకులు గొడవలు చేస్తు, భీమ్ గల్ మండల కేంద్రంలో మంత్రి సాక్షిగా తులం బీయర్ ఎస్ నాయకుల పై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యతని,ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ఎన్ని దాడులు చేసిన, కేసులు చేసిన ప్రశ్నిస్తామన్నారు. ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామన్నా హమీ అమలు చేయలేదని, బీడీలు చేసే అక్క,చెల్లెళ్లకు ఆసరా పెన్షన్ రూ. 2000 నుండి రూ 4000 లకు పెంచుతమన్నా హామీ అమలు చేయలేదని, రూ.2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. విద్యార్థులకు స్కూటి లు ఇస్తామన్నారని దానికి దిక్కులేదని, ఏ ఒక్క హామీ సక్రమంగ అమలు కాలేదన్నారు.ఇచ్చిన తులం బంగారం ఇతర హామీలను వెంటనే అమలు చేయాలనీ మహిళల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, అమలు చేయని పక్షాన మహిళలందర్నీ కూడదీసి ప్రభుత్వాన్ని నీళదీస్తామని, అసెంబ్లీ వేదికగా ఇతర అనేక మార్గల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ ని ఎండ గడుతూనే ఉంటామన్నారు.
