కేసీఆర్ ది అహంకారపూరిత ప్రసంగం
హైదరాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం అహంకారపూరితంగా ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కాంగ్రెస్ భిక్షతోనే తను సీఎం అయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గాంధీ కుటుంబం కాళ్లు మొక్కిన కేసీఆర్ కాంగ్రెస్ ను విలన్ అనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శమని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేని ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, దొర పోకడతో మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వెంకట్ అన్నారు.