Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2025, 11:55 am Posted by : ramakrishna

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్ కసరత్తు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో బీఆర్ఎస్ నేతలతో శుక్రవారం నుంచి కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.  రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబట్టేలా వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు  కూడగట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహన్ని కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.