Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 12:12 pm Posted by : ramakrishna

మరోసారి ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

హైదరాబాద్, బతుకమ్మ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ కూడా ఏఐజీ ఆస్పత్రికి శుక్రవారం వెళ్లారు. ఏఐజీ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది.