హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ అసెంబ్లీకి హాజరై , పార్టీని కాపాడుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శుక్రవారం శాసనమండలి వద్ద మీడియా చిట్‌చాట్‌లో కవిత మాట్లాడారు. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అని వ్యాఖ్యనించారు. సభకు రాకుండా నదిజలాల అంశాన్ని పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవుపలికారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని, పామూరులో ప్యాకేజీ అమ్ముకున్న వ్యక్తి అని ఆరోపించారు. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన హరీష్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారని వ్యాఖ్యనించారు. అలాగే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ను ఉరి తీయాంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. ఉద్యమకారుడిని ఉరి తీయాలంటే రక్తం మరుగుతుందని చెప్పారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలని మండిపడ్డారు.