. . . కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4 న దిక్ష
. . . రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి
. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ , బతుకమ్మ:
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారా హిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో శనివారం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడుతూ… ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా లేక కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అని ప్రభుత్వం ను ప్రశ్నించారు. అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా అని కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారు అని తెలిపారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే … యావత్తు తెలంగాణ కే నోటీసులు ఇచ్చినట్లు అని అన్నారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోబోమని అని నోటీసులు ఇవ్వాలడన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నాం అని నిరసన దిక్ష పోస్టర్లను అవిష్కరించారు..
తెలంగాణ వాదాన్ని నిలబెట్టిన జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుంది .తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంపై అయినా బలంగా గొంతెత్తింది అని గుర్తు చేశారు. కేసీఆర్, జయశంకర్ సార్ స్ఫూర్తితో జాగృతి సంస్థ పుట్టింది అన్నారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారు గతంలో అశోక్ నగర్ లో కార్యాలయం ఉండేది… ఇప్పుడు బంజారా హిల్స్ కు మార్చాము అని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి అని తెలంగాణకు రాజీవ్ గాంధీ రి ఏం సంబంధం అమరుడు శ్రీకాంతాచారి లేదా యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావు పేరు పెట్టండి డిమాండ్ చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం స్పంచించడం లేదని తెలిపారు. పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందని, గోదావరి నీళ్లు తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయి అన్నారు. జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి అని ఎమ్మెల్సీ కవిత కోరారు.
తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నది.ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా రైల్ రోకో వంటి కార్యక్రమాలు చేపట్టి పోరాటం చేస్తామని బీజేపీ ని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుంది .మహిళలకు రూ 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తాం .మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తాం . జాగృతిలో మైనారిటీ హక్కుల కోసం ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తాం జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తాం అని తెలిపారు. మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు . తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణం ,8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదు .గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ ను చూపిస్తాం అని తెలిపారు.