బీఆర్ఎస్ లో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరే
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందని న్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామన్నారు....