కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టు లో చుక్కెదురు
హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టు లో చుక్కెదురైంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం న్యాయ స్థానం విచారణ జరిపింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని అడ్వకేట్...