జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు కామ్రేడ్ల మద్దతు కోరిన కవిత

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ కవిత భేటీ     హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి కామ్రేడ్లు మద్ధతివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ముఖ్య నాయకులు వెంకటేశ్వరరావు, చలపతి రావు, గోవర్ధన్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ‘‘కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం...