ఎమ్మెల్సీ పదవీకి కవిత రాజీనామా

హైదరాబాద్, బతుకమ్మ :  కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. అలాగే  బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  రాజీనామా చేశారు. హైదరాబాద్ లోని  జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.  హరీశ్ రావు, సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీని పక్కదోవ పట్టిస్తున్నారని, తన సస్పెన్షన్ కు వారు కారణమని ఆరోపించారు.  రేపు ఇదే ప్రమాదం రామన్నకు పొంచి ఉందని తెలిపారు.