Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 9:17 pm Posted by : ramakrishna

కవిత కొత్త పార్టీ..?

  • కాంగ్రెస్, బీజేపీలోకి నో ఎంట్రీనా..?
  • మునుగోడు ఉప ఎన్నికలలోనే పార్టీ పేరు రిజిస్ర్టేషన్ జరిగిందా..?
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఖాయమేనా..?

 

హైద్రబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తర్వాత  రాజకీయ జీవితం ఎటు వైపు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవిత వెనుక ఉండి బీఆర్ఎస్ పార్టీని టార్గేట్ చేశాయని టాక్ నడుస్తుంది. అయితే ప్రధాన జాతీయ పార్టీల నేతలు ఎవ్వరు కుడా కవితను తమ పార్టీలోకి చెర్చుకునేది లేదని, కవిత సస్పెన్షన్ వ్యవహరం అంతా బీఆర్ఎస్ పార్టీ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కల్వకుంట్ల కవిత ప్యూచర్ పోలిటికల్ పై జరుగుతున్న చర్చకు మంగళవారం తెరపడుతుంది అని అందరు అనుకున్నారు. కాని  అనుహ్యంగా కవిత మీడియా ముందుకు రావడానికి బుధవారం మధ్యాహ్నం ముహూర్తం ఖరారు చేయడంతో కవిత పోలిటికల్ కెరీర్ అంశం మరి కొన్ని గంటలు గడిస్తే గాని తేటతెల్లమయ్యేలా లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత పదవి కాలం మరో మూడు సంవత్సారాలు ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయంపై కవిత మీడియా సమావేశంలో వెల్లడిస్తారని అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత ఇతర పార్టీలోకి వెళ్లరని ఆమే అనుయాయులు అంటున్నారు. భారత జాగృతి పేరిట జరుగుతున్న సేవా కార్యక్రమాలతో పాటు జాగృతి వివిధ అనుబంధ సంఘాలను ఇటీవల విస్థరించడం ఉదహరణగా చెబుతున్నారు. ఇటీవల బిసీ సామాజిక అంశంను కుడా బీఆర్ఎస్ పార్టీ తరుపున కాకుండా జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన విషయం తెలిసిందే. పేరుకు జాతీయ పార్టీ లైనప్పటికి అక్కడ కవితకు స్వేచ్చ ఉండదని భావిస్తున్నట్టు కవిత అనుచరులు చెబుతున్నారు. అసలు కవితనే ఇతర పార్టీలలోకి వెల్లకుండా సొంత పార్టీ పెడుతారని చెబుతున్నారు. అయితే కవిత కొన్ని రోజుల క్రితం అనగా మునుగోడు ఉప ఎన్నికల సంధర్బంగా పార్టీ రిజిస్ట్రేషన్ చేశారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆనాడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీలక నేతలతో చర్చించి రిజిస్ట్రేషన్ చేశారని అనుచరులు చెబుతున్నారు.  అయితే కవిత పార్టీ పేట్టిన లేదా కొత్త రాజకీయ ఆలోచనలతో ఏకిభవించి ఆమె వెంట నడిచేది ఎవరు అనే చర్చ కుడా జరుగుతుంది. ఇప్పటి వరకు కవితను కేసీఆర్ తనయగా, బీఆర్ఎస్ పార్టీ అని వెంట నడిచిన వారు ఆమె కొత్త పార్టీ పెడితే కలిసి పనిచేస్తారా అనే చర్చ జరగుతుంది. కవిత సస్పెన్షన్ తరువాత జరుగుతున్న పరిణామాల మొత్తానికి కల్వకుంట్ల కవిత బుధవారం మీడియా సమావేశం రాజకీయాలలో జరుగుతున్న, జరుగనున్న చర్చలకు చెక్ పడే అవకాశాలు ఉన్నాయి.