నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో తెలంగాణ జాగృతి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని స్థాపించి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, బతుకమ్మ, బోనాల పండుగలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్ర నిర్మాణంలో క్రియా శ్రీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అవంతి మాట్లాడుతూ కరోనా సమయంలో కోవిడ్ పేషెంట్లకు అండగా నిలబడ్డ కవిత, తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ప్రవీణ్ కుమార్, హనుమగిరి, గట్టు హరికృష్ణ, కుల్దీప్, పంచ రెడ్డి, మురళి శంకర్, శ్రీనివాస్ గౌడ్, రేఖ, సరిత, శ్రీకాంత్, నాయక్, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.