Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 1:34 pm Posted by : ramakrishna

అభివృద్ధికి కేరాఫ్ గా నిజామాబాద్ ను నిలిపిన ఘనత కవితక్క కే దక్కుతుంది

  • నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  బిఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరం క్రితమే కేటాయించిన నిధులను విడుదలను నిలుపుదల చేసి ఇప్పుడు సంవత్సరం తరువాత మేమే నిధులను తీసుకువచ్చాము అంటూ కాంగ్రెస్  నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కొందరు మీడియాతో మాట్లాడుతూ కవితక్క తాను ఎంపీ గా ఉన్న సమయంలో అభివృద్ధి జరుగలేదని అన్న దానికి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కవిత తాను ఎంపీ గా ఉన్న సమయంలో నిజామాబాద్ అర్బన్ కు 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా రైల్వే లైన్ కోసం 2014-19 సంవత్సరాలలో 178 కిమీ లైన్ కోసం పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ ప్రాజెక్ట్ లైన్ కోసం రూ.500 కోట్లు తీసుకురవడం జరిగిందని అన్నారు.  అదనంగా 85 కోట్లు ఎలక్ట్రిక్ లైన్ కోసం కేటాయించడం జరిగింది.  అదేవిధంగా మన్మాడ్ టూ డోన్ ఎలక్ట్రిక్ లైన్ కోసం ప్రతి పాధనలు పెట్టడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 841 ట్యాంకులకు 348 కోట్ల బడ్జెట్‌తో లక్ష ఎకరాల స్థిరీకరణ జరిగింది. 269 కోట్ల బడ్జెట్‌తో 47 చెక్ డ్యామ్‌లు నిర్మించబడ్డాయి.149 కోట్ల 2 లక్షల ఎకరాల ఆయకట్టును సిద్ధం చేసి నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టారు.  గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ పనులకు రూ.75 కోట్లు కేటాయించారు. మునిపల్లి, ఫతేపూర్, చిట్టాపూర్, సుబ్బిరియాల్ తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొత్తం 149 కోట్లు వచ్చాయి. శ్రీరాంసాగర్ పునరుజీవన పథకానికి రూ.2000 కోట్లు, వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో స్పైస్ పార్క్ ఏర్పాటుకు రూ.42 కోట్లు కేటాయించగా, ఐటీ ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయించి నిర్మించి అందులో ఉద్యోగాలు కూడ కల్పించారని పేర్కొన్నారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి లైన్ నిర్మాణానికి కవితక్క చొరవతో 63 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ నగరం లో గల రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కవితక్క చొరవతో 21 కోట్ల , గత 10 సంవత్సరాలలో నిజామాబాద్ నగరంలో గల రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీన్ పార్క్ లు, రఘునాథ ఆలయం చెరువు, ఐటి హబ్, వైకుంఠ దామాలు, మున్సిపల్ రీనుయేషన్ తదితర అభివృద్ధి 100ల కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి బిఆర్ఎస్, ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు., సంవత్సరం క్రితమే నిజామాబాద్ నగరం లో గల 60 డివిజన్లకు గాను డివిజన్ కు 1 కోటి రూపాయలు చొప్పున మొత్తంగా 60 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించడం కాంగ్రెస్ నాయకులు గుర్తించలేదన్నారు.