కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

 కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరిస్తుందని కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం నిజమాబాద్ జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్ లో ఎర్పాటు చేసిన  మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించిన పార్టీ బి.ఆర్.ఎస్ గా మార్చుకున్న టీఆర్ఎస్  పార్టీ అని అన్నారు. పదేళ్ల పాలనలో రాజకీయంగా ఆర్థికంగా  రాష్ట్రంలో బీసీలు వెనుకబడి పోయారని,...