Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 7:28 pm Posted by : ramakrishna

కవితకు మూడు వారాల విశ్రాంతి అవసరం

సూచించిన ఎఐజీ వైద్యులు
హైద్రాబాద్ , బతుకమ్మ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడు వారాల విశ్రాంతి అవసరమని ఏఐజీ వైద్యులు సూచించారు. కవిత మంగళవారం వైద్య సేవల నిమిత్తం ఎఐజీలో చేరిన విషయం తెలిసిందే. అన్ని రకాల వైద్య పరిక్షలను నిర్వహించిన వైద్యులు గైనిక్ సమస్యలతో భాదపడుతున్న కవితకు విశ్రాంతి అవసరమని సూచించారు. డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆమె తీవ్ర ఆనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. కవితకు వైద్యులు విశ్రాంతి తీసుకొవాలని సూచించడంతో ఆమె బతుకమ్మ ఉత్సవాలకు దూరం కానున్నారు.