మల్కాజిగిరి -కామారెడ్డి మధ్య కవచ్ 4.0

  . . . విజయవంతంగా స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ   కామారెడ్డి, బతుకమ్మ :   భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అమలులో తెలంగాణ మరో ఘనతను సాధించింది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్కాజిగిరి - కామారెడ్డి సెక్షన్ పరిధిలో 108 రూట్ కిలోమీటర్ల మేర అత్యాధునిక ‘కవచ్ 4.0’ వెర్షన్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించడానికి ఇది...