Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 5:17 pm Posted by : ramakrishna

సీపీఎం నుంచి కటారి రాములు, పిట్ల నరేష్ బహిష్కరణ 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిపిఎం పార్టీ నగర నగర కమిటీ నుంచి కటారి రాములు ను  పిట్ల నరేష్ ను బహిష్కరిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత తెలిపారు. వారు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటం జరిగిందని  సిపిఎం పార్టీలో క్రమశిక్షణగా, పార్టీ నిబంధనకు అనుగుణంగా ఉండే వారిని మాత్రమే కొనసాగిస్తాం అన్నారు. వారు క్రమశిక్షణను ఉల్లంఘించి నిబద్ధతకు వ్యతిరేకంగా వ్యవహరించినందున వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీ నగర కమిటీ నుండి, సాధారణ సభ్యత్వం నుండి బహిష్కరిస్తూ ఇకపై నుండి  సిపిఎం పార్టీకి వారికి ఎలాంటి సంబంధం ఉండదు అని తెలిపారు. ఈ సమావేశంలో నగర నాయకులు  నల్వాల నరసయ్య, బొప్పని అనసూయ, అడివాల అనిత, సిరిపలింగం తదితరులు పాల్గొన్నారు.