13 వ డివిజన్ లో తాగు నీటికి కట కటా

  . . . రోడ్డేక్కిన మహిళలు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని 13 వడివిజన్ లో మంచి నీటి కోసం మహిళలు రోడ్డేక్కారు. శుక్రవారం నగర శివారులోని సారంగపూర్ లో మంచినీటి సరఫరా జరుగడం లేదని మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందేలతో రోడ్డుపై నిరసన తెలిపారు. ఈసంధర్బంగా రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జా అయింది. చివరకు మున్సిపల్ కమీషనర్ దిలిప్ కుమార్ మంచి నీటి సరఫరా చేస్తామని హమీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు.