Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2025, 7:20 pm Posted by : ramakrishna

కాసుల బాలరాజ్ మీ అసత్య ప్రచారాలు మానుకో

  • మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్

 

బాన్సువాడ, బతుకమ్మ  : దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా మోసి ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్న ,రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి దామరంచ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్బాల్ పటేల్ చావుకు కారణం మీ మనుషులు కాదా ఎక్కడెక్కడ ఏ అధికారులను ఇక్బాల్ పనులు చేయకుండా అడ్డుకున్నది మీ మనుషులు కాదా అంటూ మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కాసుల బాలరాజుకు సూటి ప్రశ్న వేశారు. తప్పు చేసింది మీరు ఆయన చావుకు కారణం అయింది. మీరు ఇప్పుడు దానిని తప్పిపుచ్చుకోవడానికి ఏదో మాట్లాడుతున్నారని ద్రోణవల్లి సతీష్ తీవ్రంగా కాసుల బాలరాజ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇక్బాల్  ఎస్డిఎఫ్ నిధులు  రూ. 15 లక్షలతో షాదిఖానా నిర్మాణం చేపడితే బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేయడంతోనే గుండెపోటుతో మృతి చెందారని మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ అన్నారు. ఆదివారం బీర్కూరు మండలం మల్లాపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఇక్బాల్ నాలుగు నెలల నుంచి అనారోగ్యంతో ఉండి మృతి చెందారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు.ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం వరకు అందరితో కార్యకర్తలతో ఇఫ్తార్ విందులో పాల్గొని కొన్ని శుభకార్యాలలో కూడా పాల్గొన్నాడని ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వలననే గుండెపోటు వచ్చిందని అన్నారు.మంచి హోదాలో ఉన్న కాసుల బాలరాజు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సమన్యాయం చేస్తామని అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండెపోటుతో చనిపోతే కనీసం, ఆ కుటుంబాన్ని పరామర్శించే మానవత్వం లేకుండా కాసుల బాలరాజు మాట్లాడడం, ఎంతవరకు సమంజసం అంటూ మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ ఆరోపించారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగిన మైనార్టీ నాయకుడు ఇక్బాల్ తాను చేయదలుచుకున్న పనులకు అక్కడ ఉన్న కొంతమంది, మీ మనుషులు అడ్డుకొని అధికారులపై ఒత్తులు తెచ్చి పనులు చేయకుండా అడ్డుకున్నది నిజం కాదా? నాలుగు నెలల నుంచి ఆరోగ్యం బారిన పడ్డాడని తప్పుడు ఆరోపణలు చేయడం ఇంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఈ నెలలో ఇక్బాల్ ఎక్కడెక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారు, దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని తన దగ్గర ఉన్నాయని దమ్ముంటే ఆ ఏడుకొండల కలియుగ దైవం ఆలయానికి రండి నేను నిరూపిస్తా అంటూ ద్రోణవల్లి సతీష్, కాసుల బాలరాజుకు సవాల్ చేశారు. మీ మనుషులు చేయడం వల్లే అధికారులు ఇక్బాల్ చేయాలనుకున్న పనులకు చేయకుండా అధికారులపై ఒత్తిడి మీరు తీసుకొచ్చిన మాట వాస్తవ కాదా? ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వాడుగా మీరు ముద్ర వేసి ఆయనకు పనులు చేయకుండా ,ఆ నిరుపేదకు చెందిన మైనార్టీ నాయకుడు ఇగ్బాల్ మృతికి మీరే కారణం అంటూ ద్రోణవల్లి సతీష్ ఆరోపించారు. స్వయంగా ఇక్బాల్ కుటుంబ సభ్యులు మీ మీద, మీ అనుచరుల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుడు అని తెలిసి ఆయన చనిపోతే కనీసం చూడడానికి రాని మీరు ,ఎక్కడో ఉండి ఇప్పటినుంచి పాత కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నించారు. మీరు ఎన్ని పార్టీలు మార్చారు, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో జత కలిపి మీడియా సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడడం సబబు కాదు ,కాసుల బాలరాజు ఒక్కసారి వెనుకకు తిరిగి నీ చరిత్ర తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు. తాను 1994 నుంచి 2023 వరకు ప్రతి ఎన్నికల్లో ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేశానని, రూ. కోట్లు సంపాదించానని కాసుల బాలరాజ్ తనపై  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్యాయంగా, అక్రమంగా  ఒక్క రూపాయి సంపాదించిన నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మండిపడ్డారు. 2014లో తాను పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇసుక దందా చేసిన మాట వాస్తవం. దీంట్లో తనకు వచ్చిన వాటా వెంకటేశ్వర స్వామి ఆలయానికి, పాండురంగ విట్టలేశ్వర ఆలయానికి విరాళంగా అందజేశారు. మీరు రండి పచ్చి బట్టలతో నేను, నాకు వచ్చిన వాటా డబ్బులు ఆలయాలకు ఇచ్చినట్లు నిరూపిస్తా. మీలాగా ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన చెప్పిన మాటకు వేదంగా భావించి తాను నష్టాల్లో కష్టంలోఉన్నప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశమేరకు మొట్టమొదటిసారిగా బాన్స్వాడ నియోజకవర్గంలో రెండు పడక గదిలో ఇళ్ల నిర్మాణం బైరాపూర్, బీర్కూర్, భరింగిడిగి, కిష్టాపూర్ గ్రామాలలో రెండు పడక గదిలో నిర్మాణాలు చేపట్టిన విషయం కాసుల బాలరాజు నీకు తెలియదా? ఇప్పటివరకు తాను చేసిన పనులకు ఎన్ని బిల్లులు నిలిచిపోయాయో నీకు తెలుసా? ఎమ్మెల్యే ఎన్నికల్లో నీకు ఏ విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారో, ఒక్కసారి తెలుసుకో. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే ప్రజలు నీ వైపు ఉండేవారు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓటమిపాలయ్యావో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకో. ఎమ్మెల్యే టికెట్ రావడంలేదని పురుగుల మందు తాగినప్పుడే నీ రాజకీయ చరిత్ర ముగిసిందని ద్రోణవల్లి సతీష్ తీవ్రంగా ఆరోపించారు. తాను 1994 నుంచి 2023 వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పనిచేసి, ఆయనకు ఒక లక్ష్మణుడుగా ఉంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద నుంచి నయా పైసా ఆశించకుండా, ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు కల్పించకుండా, తాను పనిచేశానని ద్రోణవల్లి సతీష్ ఈ సందర్భంగా కాసుల బాలరాజుకు సూటి ప్రశ్న వేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఎవరు స్థాయి ఎంతో ప్రజలకు తెలుసని, ఇది ప్రత్యేకంగా తాను చెప్పనవసరం లేదని ద్రోణవల్లి సతీష్ ఈ సందర్భంగా మీడియాతో వెల్లడించారు. తాను అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు అని ఆరోపిస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే పచ్చి బట్టలతో ఆ కలియుగ దైవం ఆలయం కి వచ్చి నిరూపించండి అంటూ కాసుల బాలరాజుకు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి గణేష్, వెంకట్ రెడ్డి, అబ్దుల్ ఖాదర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనార్టీ నాయకుడు రంజాన్ మాసంలో గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులు, కార్యకర్తలు మల్లాపూర్ గ్రామంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ అల్లాను ప్రార్థించారు. ఇక్బాల్ కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.

Kasula Balaraj, stop your false propaganda.