Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 1:31 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కాసుల బాలరాజ్

బాన్సువాడ ,బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా వదులుతున్న నీటి ప్రవాహాన్ని మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు నుంచి నిజాంసాగర్ కు వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులు, ప్రజలు చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు వహించాలన్నారు. రైతులు పంట పొలాల్లో విద్యుత్ తీగలు, బోరు మోటర్ల వద్ద తడిచేతులతో తాకరాదని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.