కాస మధుకు రాష్ట్ర స్థాయి 35వ ర్యాంక్
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కాస మధు కు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎకనామిక్స్ నందు 35వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న తెలిపారు. ఇది కళాశాలకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా కాస మధును సన్మానించి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రతిభకు కొదవలేదన్నారు. విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఎదగలన్నారు. డోన్కల్ గ్రామానికి చెందిన మధుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్...