Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:27 pm Posted by : ramakrishna

కాస మధుకు రాష్ట్ర స్థాయి 35వ ర్యాంక్

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కాస మధు కు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎకనామిక్స్ నందు 35వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న తెలిపారు. ఇది కళాశాలకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా కాస మధును సన్మానించి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రతిభకు కొదవలేదన్నారు. విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఎదగలన్నారు.  డోన్కల్ గ్రామానికి చెందిన మధుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, అకాడమిక్ ఆర్డినేటర్ డి ఆర్ యు దశరథ్, ఇన్ రాజయ్య, సీనియర్ అద్యాపకులు డాక్టర్ టి రవీందర్, కళాశాల అధ్యాపకులు అధ్యపకేతర, ఇతర సిబ్బంది, విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.