Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 9:31 pm Posted by : ramakrishna

ఆర్టీసీ డిపోలో కార్తీక వనభోజనాలు

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : దుబ్బాక ఆర్టీసీ డిపోలో గురువారం నాడు కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు సోదర భావం, ఒక కుటుంబం అన్న భావనతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండి వీసీ సజ్జన్నార్ ఆదేశాల మేరకు కార్తీక వన భోజన కార్యక్రమాన్ని దుబ్బాక డిపోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిద్దిపేట డిపో మేనేజర్ వై సుఖేందర్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. వన భోజన కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులంతా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం, అందరి మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగులు స్నేహపూర్వక వాతావరణంలో సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిపో చీఫ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరి, దుబ్బాక డిపో ఇన్ఛార్జ్ కనక లక్ష్మి, టీఐ-3 లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.