
. నీలకంఠుడి చెంత కోటివత్తుల దీపం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి దీపాలు వెలిగించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం ఆవరణలో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక్ నగర్ కుచెందిన సిర్ప నరేశ్, లావణ్య దంపతులు కోటి వత్తుల దీపాన్ని, సృజన్, దీపిక దంపతులు లక్ష వత్తుల దీపాన్ని వెలగించారు. శ్రీశైలంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ దీపాలను ప్రతి ఏడాది తెప్పించి వెలిగిస్తున్నట్లు వారు తెలిపారు. నగర శివారులోని ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు సైతం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు.
