గోదావరి తీరాన వెలిగిన కార్తీకదీపం
బతుకమ్మ,మోర్తాడ్ : పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు శుక్రవారం గోదావరి పుణ్య స్నానాలకు వెళ్లడం జరిగింది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న పోచంపాడ్ ,సావేల్, తడపాకల్ పుష్కర ఘాట్లకు భక్తులు వందల సంఖ్యలో తరలి రావడంతో గోదావరి నది కార్తీక శోభన సంతరించుకుంది. భక్తులు పుణ్య స్థానాల ఆచరించి నైవేద్యాలు సమర్పించి సకుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో గోదావరి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నది ఒడ్డున ఉన్న శివాలయాల్లోనూ రామాలయాల్లోనూ దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకొని నియమనిష్టాలతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక...