మోర్తాడ్, బతుకమ్మ: కార్తీక మాసం కావడంతో గోదావరి పుణ్యస్నానాలు చేయడానికి శుక్రవారం గోదావరి నదికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గోదావరి నది కార్తీక్ శోభన సంతరించుకుంది. మెండోరా మండలంలోని పోచంపాడ్, ఏర్గట్ల మండలంలోని తడపాకల్ నది తీరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వంటలు చేసుకుని నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
