కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

... నిజామాబాద్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శనివారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ నెల 16న ఆదివారం కార్తీక సమారాధన ఆత్మీయ సమావేశం వనభోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దేవాలయంలో కార్తీక సమారాధన పత్రికను ఆవిష్కరించనున్నట్లు బ్రహ్మణ సంఘం అధ్యక్ష కార్యాదర్శులు శశికాంత్ కులకర్ణి,రమేష్ బాబు కులకర్ణిలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...