… నిజామాబాద్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శనివారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ నెల 16న ఆదివారం కార్తీక సమారాధన ఆత్మీయ సమావేశం వనభోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దేవాలయంలో కార్తీక సమారాధన పత్రికను ఆవిష్కరించనున్నట్లు బ్రహ్మణ సంఘం అధ్యక్ష కార్యాదర్శులు శశికాంత్ కులకర్ణి,రమేష్ బాబు కులకర్ణిలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని బ్రాహ్మణ ఆత్మీయ బంధువులు అందరు ఈ కార్తీక సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. ఉదయం 8.30 నుండి గణపతి హోమం, కుంకుమార్చన, గోపూజ, ఉసిరి చెట్టు పూజ,మహిళా లు సామూహిక పారాయణం నిర్వహిస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మిలింద్ కుమార్, ఉపాధ్యక్షులు కోళవి విజయ్ కుమార్, దామోదర్ రావు,లక్ష్మి నారాయణ భరద్వాజ్, మల్లికార్జున్ రావు, రత్నాకర్, ప్రకాష్ కులకర్ణి, భీమ్ రావు దేశాయ్, ఈమని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.