. . . భారీ బందోబస్త్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
తమిళనాడు లో కార్తీకదీపం వెలిగించే కార్యక్రమానికి భద్రతగా సిఆర్పిఎఫ్ దళాలు. తిరుప్ప కుండ్రం కొండపైకి చేరుకుంటున్నాయి. కొండమీద ఉన్న దీప స్తంభం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వాటి పక్కనే ఉన్న దర్గాకు రక్షణగా నిలుస్తాయి . ఆ తర్వాత శనివారం సాయంత్రం దీపం వెలిగించే కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించి ,ఆ తర్వాత సిఆర్పిఎఫ్ దళాలు తిరిగి వస్తాయి. దాదాపు నాలుగు వేల మంది సీఆర్పీఎఫ్ దళాలను అక్కడ మోహరించారు . దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడంతో, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కనపెట్టి తనే స్వయంగా జోక్యం చేసుకొని దీపం వెలిగించే కార్యక్రమానికి మార్గదర్శకాలు రూపొందించింది. రాష్ట్ర పోలీసులను కూడా ఆ పరిధిలోకి రానీయకుండా ఆదేశాలిచ్చి ఔటర్ సెక్యూరిటీకి మాత్రమే వాడాలని చెప్పింది. సిఆర్పిఎఫ్ జనరల్ కమాండ్ ను అక్కడ ఏర్పాట్లకు నియమించి , కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ దగ్గర ఉండాలని కూడా ఆదేశించింది. ఇదివరకే దేవస్థానం కమిటీని కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులను ట్రస్టీలుగా కూడా నియమించేసింది . వచ్చే నెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ , మదురై జిల్లా కలెక్టర్ , మధురై జిల్లా ఎస్పీ తదితర 13 మంది ఉన్నతాధికారులు సుప్రీం కోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
