ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారు.. కమల్ ను  ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, బతుకమ్మ : తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల వ్యాఖ్యానించి సినీ నటుడు కమలహాసన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయన సినిమా థగ్ లైఫ్ పై రాష్ట్రంలో నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మీరు ఏమైనా చరిత్రకారుడా.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారని కమలహాసన్ ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.