. . . మండల మండల విద్యాశాఖాధికారి సక్కి అశోక్ కుమార్
. . .నవీపేట్ లో వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు పూర్తి
. . . రాష్ట్ర టోర్నీకి జిల్లా బృందం ఖరారు
బతుకమ్మ, నవీపేట్ :
ఎస్ జి ఎఫ్ నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17 బాల బాలికల ఎంపిక పోటీలు గురువారం నవీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందని ఎస్ జి ఎఫ్ నిజా మాబాద్ క్రీడల నిర్వహణ కార్యదర్శి నాగమణి తెలిపారు. నవీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడి డాక్టర్ రవీందర్ అబ్బాపూర్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. వివిధ శరీర బరువు కేటగిరిలో బాల బాలికలకు వేరువేరుగా పోటీలు జరిగాయి. ఇందులో ప్రతిభ చాటిన క్రీడాకారులు, క్రీడాకారినీలను రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పతకం సాధించిన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరినీ ఆదర్శంగా తీసుకొని వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఎదగాలని మండల విద్యాశాఖ అధికారి సక్కి అశోక్ కుమార్ ఉద్ఘటించారు. సాధనతో వెయిట్ లిఫ్టింగ్ లో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని పేర్కొన్నారు. చదువు ఆటలు రెండు విద్యార్థులకు ముఖ్యమైనవే అన్నారు. శారీరక మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను సానబడితే మెరీకల్ లాంటి క్రీడాకారులు తయారవుతారని చెప్పారు. కార్యక్రమంలో నవీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం రత్నకుమారి, పిడి రవీందర్ సీనియర్ ఉపాధ్యాయులు జదిద్య, భూమయ్య, పీడీలు సంగీతరావు, స్వప్న, వెంకటేశ్వరరావు, అబ్బయ్య, రమేష్, గణేష్, మధుకర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎంఈఓ సక్కి అశోక్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించారు.
