వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలు

  ఇందల్వాయి, బతుకమ్మ :   వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామంలో గురువారం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. గ్రామస్తులు కప్పలను తడి వస్త్రంలో తీసుకువచ్చి కర్రకు కట్టి, డప్పుల చప్పుళ్ల నడుమ "కప్పతల్లి.. కప్పతల్లి.." అంటూ పాటలు పాడుతూ గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కప్పలపై బిందెలతో నీటిని పోస్తూ సంప్రదాయ ఆచారాన్ని పాటించారు. ఇటీవల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని...