Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2024, 6:21 pm Posted by : ramakrishna

కాంతారావు హటావో . . . కాంగ్రెస్ బచావో

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

. . . గాంధీ భవన్ వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

బతుకమ్మ , బిచ్కుంద  : 

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్ గా అక్కడ రెండు గ్రూప్ లు చీలిపోయాయి. ఏకంగా ఎమ్మెల్యేపైనే సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. జూక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారన్నారు. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలోని ఎనిమిది మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లో  గాంధీభవన్ కి వెళ్లి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా టిఆర్ఎస్, బిజెపి వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడని , సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులు తన అనుకూలమైన వారికి అంటకడుతున్నారని లక్ష్మీకాంతరావు పై మండిపడ్డారు. ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ప్రవర్తన మారకుంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తెచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను విస్మరిస్తూ తనకు ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై చరలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సౌదాగర్ అరవింద్, కమల్ సెట్, వినోద్, సంగమేశ్వర, జయ ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.