Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 3:49 pm Posted by : ramakrishna

దళితుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేసిన వ్యక్తి కమ్మరి గంగాధర్

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన రాష్ట్ర బీఎస్పీ నాయకులు కమ్మరి గంగాధర్ ఇటీవల అనారోగ్యం కు గురికావడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. కమ్మరి గంగాధర్ మరణ వార్త విని బి.ఎస్.పి రాష్ట్ర సెక్రటరీ ఎడ్ల రాములు, నిజామాబాద్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కేశ్పల్లి రవి, జిల్లా నాయకులు భీమప్ప, పాశంకుమార్, కేపీ గంగారం అంత్యక్రియలో పాల్గొన్నారు. మరణించిన గంగాధర్ మృతదేహం పైన బిఎస్పి బట్టకప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరణించిన కమ్మర్ గంగాధర్ దళిత బహుజన ఫ్రంట్,బహుజన సమాజ్ పార్టీలలో రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షులుగా పని చేశాడని గుర్తు చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాల పైన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా నిలిచారని గుర్తు చేశారు. దళితుల పట్ల ఆయన పోరాడిన సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందికి దళితులకు మేలు చేకూరిందని పేర్కొన్నారు. దళితుల సమస్యల పట్ల  పోరాటంలో ఎలాంటి భయం లేకుండా ప్రజా ప్రతినిధులను, అధికారులను నిలదీసిన వ్యక్తిగా నిలిచారని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి అంత్యక్రియలలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.