శ్రీ చైతన్య హాస్టల్ లో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య
కామారెడ్డి, బతుకమ్మ: శ్రీచైతన్య నిజాంపేట బ్రాంచిలో కామారెడ్డికి చెందిన విద్యార్థి జస్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో తోటి విద్యార్థులతో కలిసి జస్వంత్ ఎప్పటిలాగే నిద్రించాడు. గురువారం ఉదయం లేచిచూసే సరికి ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. హాస్టళ్లలో విద్యార్థుల బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా హాస్టళ్లలో పరిస్థితులు మారడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.